“అశ్విని దత్” కు ఎన్టీఆర్ శతాబ్ది అవార్డు

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం అయినా విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా స్థానిక తెనాలి పట్టణం NVR కళ్యాణ మండపంలో నట సింహం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సారధ్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలని చిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత శ్రీ సి. అశ్విని దత్ గారికి ఎన్టీఆర్ మనువడు, ప్రముఖ సినీ హీరో నందమూరి తారక రత్న చేతుల మీదుగా అందించడం జరిగినది.

2022 మే 28 న మొదలైన ఈ శత జయంతి వేడుకలు 365 రోజుల పాటు 2023 మే 28 వరకు జరగనున్న విషయం విదితమే. 365 రోజులు… వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.

Related Posts