“మా ఊరి పొలిమేర” – రివ్యూ

సత్యం రాజేష్, బాలాదిత్య, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను తదితరులు న‌టించిన చిత్రం మా ఊరి పొలిమేర‌. ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భోగేంద్ర గుప్త ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్ స్టార్‌లో విడుదలయ్యింది. మ‌రి.. ఈ సినిమా ఆక‌ట్టుకుందా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ

కొమరయ్య, బాబ్జీ, మరియు జంగయ్య తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న సోదరులు. అయితే.. ఆ ఊరి గ్రామ సర్పంచ్ ఆకస్మికంగా మ‌ర‌ణిస్తాడు. ఆతర్వాత వారి జీవితాలు మ‌రింత అధ్వాన్నంగా మార‌తాయి. సర్పంచ్ మ‌ర‌ణం స‌హ‌జ మ‌ర‌ణం కాదు. ఆయ‌న చ‌నిపోవ‌డం వెనుక ఏదో పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని తెలుస్తుంది. ఎందుకు స‌ర్పంచ్ చ‌నిపోయారు. దీని వెన‌కున్న‌ మిస్టరీ ఏంటి.? స‌ర్పంచ్ మ‌ర‌ణం కొమ‌ర‌య్య‌, బాబ్జీ, జంగ‌య్య‌ల పై ఎలాంటి ప్ర‌భావం చూపించింది.? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకువ‌చ్చింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్
స‌త్యం రాజేష్, బాలాదిత్య న‌ట‌న‌
ట్విస్ట్ లు
రీ రికార్డింగ్

మైన‌స్ పాయింట్స్
బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం
స్ర్కీన్ ప్లే

విశ్లేష‌ణ

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుతంగా నటించాడు. ఇక బాలాదిత్య అయితే.. కెరీర్ బెస్ట్ ప‌ర్ ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని చెప్ప‌చ్చు. గ్రామీణ వాతావార‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో ఊహించ‌ని ట్విస్ట్ లు సినిమాకి ప్ల‌స్ పాయింట్స్ అని చెప్ప‌చ్చు. అయితే.. గ్రామీణ మ‌హిళ‌ల‌ను అణిచివేసే స‌న్నివేశాలు చూపించే విధానం కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం న‌చ్చ‌వు. అంత‌లా చిత్రీక‌రించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగుంది.

ఇక ద‌ర్శ‌కుడు గురించి చెప్పాలంటే.. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఒక గ్రామీణ సబ్జెక్ట్ కి మర్డర్ మిస్టరీ యాడ్ చేశారు.
ఈ క‌థ‌ను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ట్విస్టులుతో ఇంట్ర‌స్టింగ్ గా సాగేలా క‌థ‌ను రాసుకున్నారు కానీ.. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డం మైన‌స్ అని చెప్ప‌చ్చు. కొన్ని స‌న్నివేశాలు మ‌రీ పేల‌వంగా ఉన్నాయి. అయితే.. అడ‌ల్ట్ కంటెంట్ ఇష్టప‌డేవారికి ఇది బాగా న‌చ్చుతుంది. అలాగే రియ‌లిస్టిక్ డ్రామాను ఇష్ట‌ప‌డేవారికి కూడా ఈ సినిమా ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌ని చెప్ప‌చ్చు.

Related Posts