అట్టాసూడకే అంటూ ఖిలాడీ రిక్వెస్ట్

మాస్ మహరాజ్ రవితేజ నుంచి వస్తోన్న కొత్త సినిమా ఖిలాడీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు బాగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా న్యూ ఇయర్ స్పెషల్ గా మరో పాట విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ గానం చేసిన ఈ పాట అట్టా సూడకే మత్తెక్తాందీ ఈడుకే అంటూ గమ్మత్తుగా ఉంది. దేవీతో పాటు సమీరా భరద్వాజ్ ఫిమేల్ వాయిస్ వినిపించారు. శ్రీమణి సాహిత్యం అందించాడు. రాక్షసుడు రీమేక్ తో ఫామ్ లోకి వచ్చిన రమేష్ వర్మ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో మాస్ రాజా డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. టైటిల్ కూడా అతని ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండటంతో రవితేజ ఖాతాలో మరో హిట్ పడటం గ్యారెంటీ అనుకుంటున్నారు ఫిల్మీ లవర్స్.

రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ పాటలో మీనాక్షి ఛౌదరి కనిపిస్తోంది. తన సోయగాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాయని ఈ లిరికల్ వీడియో సాంగ్ చూస్తేనే తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ సమకూర్చిన స్టెప్పులు రవితేజకు తగ్గట్టుగా సింపుల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. సాహిత్యం పరంగా మరీ అంత తళుకులేం లేవు కానీ.. సింపుల్ గా సాగిపోయేలా ఉంది. అంటే సినిమాలో వచ్చే రెగ్యులర్ డ్యూయొట్ కు సరిపోయేలా ఉందన్నమాట.
ఇక ఈ మూవీని మార్చి నెలలో విడుదల చేస్తారు అని చెప్పినా.. ఆ డేట్ కు రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా మాగ్జిమం పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన కీలకమైన సన్నివేశాలను యూరప్ లో షూట్ చేయాలనుకున్నారు. బట్ అక్కడ కరోనా తర్వాత ఇప్పుడు ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో షూటింగ్ కు పర్మిషన్ రావడం కష్టం అంటున్నారు. ఆ కారణంగానే సినిమా విడుదల తేదీ కూడా మారొచ్చంటున్నారు.
కాకపోతే ఇలా పాటలు రిలీజ్ చేస్తున్నారంటే ఆ పార్ట్ ను ఇక్కడే ఎలాగోలా చిత్రీకరిస్తున్నారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ మార్చిలోనే ఈ మూవీ వస్తే మాత్రం అదే నెల 25న రవితేజ రామారావు ఆన్ డ్యూటీ కూడా ఉంది. మరి ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

Related Posts