పెళ్లి పీటలెక్కబోతున్న ఈషా రెబ్బా..

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈషా రెబ్బా త‌ర్వాత అంత‌కు ముందు ఆ త‌ర్వాత చిత్రంతో హీరోయిన్‌గా మెప్పించింది. ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. సినిమాల‌తో పాటు డిజిట‌ల్ మాధ్యమంలోనూ ఈషా రెబ్బా న‌టించింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోక‌పోయిన‌ప్ప‌టికీ న‌టిగా మంచి పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

సాధార‌ణంగా కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉండే ఈషా రెబ్బా ఇప్పుడు నెట్టింట వార్త‌గా ఎందుకు నిలుస్తుంద‌నే అనుమానం రాక మాన‌దు. విష‌య‌మేమంటే.. ఈషా రెబ్బా త్వ‌ర‌లోనే పెళ్లి పీట లెక్క‌నుంద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే. ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోయేది ఓ స్టార్ డైరెక్ట‌ర్‌ని. అది కూడా తెలుగు డైరెక్ట‌ర్‌ని కాదండోయ్‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ని.

కోలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న ఆ డైరెక్ట‌ర్‌ను ఈషా రెబ్బా ఈ మ‌ధ్య‌నే క‌లిసింద‌ట‌. అభిప్రాయాల‌ను క‌ల‌వ‌టంతో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని, ఆ ప్రేమ కాస్త పెళ్లి వైపు అడుగు లేయింద‌ని టాక్‌. మ‌రి ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోయే డైరెక్ట‌ర్ ఎవ‌రా? అనే ఆస‌క్తి అందరిలోనూ మొద‌లైంది.

మ‌రి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యంపై వ‌స్తున్న వార్త‌ల‌కు ఈషా రెబ్బా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Posts