టాలీవుడ్ విల‌న్స్ రెమ్యూన‌రేష‌న్స్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో హీరోలు కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. విల‌న్స్ కూడా కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు. అవును.. ఇది నిజంగా నిజం. అయితే.. ఇంత‌కీ టాలీవుడ్ లో కోట్ల‌లో పారితోషికం తీసుకుంటున్న ప్ర‌తి నాయ‌కులు ఎవ‌రంటారా..? ముందుగా చెప్పుకోవాల్సింది జగపతిబాబు గురించి. ఒకప్పటి ఈ హీరో ఇప్పుడు విలన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. మధ్యలో కారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తున్నారు. ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నారు ఈ జ‌గ్గుభాయ్.

శ్రీకాంత్ మొదట్లో విలన్‌గా నటించి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. తాజాగా బాలయ్య అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాకు కోటికి పైగానే అందుకున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో శ్రీకాంత్ కు విల‌న్ గా మ‌రింత డిమాండ్ పెరిగింది. ప్రకాశ్ రాజ్ ఒక్క రోజుకు 10 లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలకు కోటిన్నర వరకు తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. ఇక సోనూ సూద్ గురించి చెప్పాలంటే.. ఈ రియల్ హీరో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

మిర్చి సంపత్ రాజ్.. మిర్చి సినిమాతో స్టార్ విలన్‌గా మారిపోయాడు. ఈయన ఒక్కో సినిమాకు 40 లక్షలకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకు 50 లక్షలు తీసుకుంటున్నాడని స‌మాచారం. క‌న్న‌డ‌ స్టార్ అయిన సుదీప్ ఇతర భాషల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్ గా మెప్పిస్తున్నాడు. ఆది సినిమాకు కోటికి పైగానే తీసుకుంటున్నాడు. రంగస్థలం సినిమాలో అద్భుతంగా న‌టించాడు.

భోజ్‌పురి సూపర్ స్టార్ ర‌వికిష‌న్ తెలుగులో స్టార్ విలన్ అయిపోయాడు. ఈయన సినిమాకు 40 లక్షల వరకు తీసుకుంటున్నాడు. హరీష్ ఉత్తమన్ 30 లక్షలు, వివేక్ ఒబేరాయ్ 3 కోట్లు, నీల్ నితిన్ ముఖేష్ 2 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. ఈ విధంగా విల‌న్స్ సైతం కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు.

Related Posts