దేవర కి మరో జోడీ కుదిరింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా వాయిదా పడినా.. షూటింగ్ మాత్రం యదావిధిగా కొనసాగుతూనే ఉంది. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదనే కొరటాల శివ ‘దేవర 1’ కోసం మరో డేట్ ను పరిశీలిస్తున్నాడట. ఇదిలా వుంటే.. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒక పాత్రకోసం ఆల్రెడీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంచుకున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది.

లేటెస్ట్ గా ఎన్టీఆర్ పోషించే మరో క్యారెక్టర్ కి జోడీ కుదిరింది. మరాఠీ బ్యూటీ శృతి మరాఠే ని మరో కథానాయికగా ఎంచుకున్నారట. మరాఠీతో పాటు కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది శృతి మరాఠే. హిస్టారికల్, పీరియడ్ రోల్స్ లో ఈ బ్యూటీ సరిగ్గా సరిపోతుంది. అందంతో పాటు అభినయంలోనూ అదరగొట్టే ఈ ముద్దుగమ్మను ‘దేవర’లో ఒక హీరోయిన్ గా లాక్ చేశారట.

Related Posts