“భీమ్లా నాయ‌క్” విడుద‌ల పై క్లారిటీ వ‌చ్చింది. మ‌రి.. “బంగార్రాజు”.?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్, రాజ‌మౌళిల‌ ఆర్ఆర్ఆర్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికి విడుద‌ల అవుతున్నాయి. అయితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ భీమ్లా నాయ‌క్, కింగ్ నాగార్జున బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. భీమ్లా నాయ‌క్ సంక్రాంతికి రావ‌డం ప‌క్కా అని నిర్మాత‌లు చెప్పిన‌ప్ప‌టికీ.. వాయిదా ప‌డ‌నున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. అనుకున్న‌ట్టుగానే భీమ్లా నాయ‌క్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఫిబ్ర‌వ‌రి 25కి భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డింది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది.

అయితే.. భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డ‌డంతో బంగార్రాజు ఖ‌చ్చితంగా సంక్రాంతికి వ‌స్తుంది. జ‌న‌వ‌రి 15న బంగార్రాజు విడుద‌ల అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది దాదాపుగా క‌న్ ఫ‌ర్మ్. అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావ‌డ‌మే ఆల‌స్యం అంటున్నారు సినీ జ‌నాలు. అయితే.. తాజాగా బంగార్రాజు విడుద‌ల టెన్ష‌న్ లో ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కార‌ణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న వ‌స్తుంటే.. రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14న వ‌స్తుంది. ఈ రెండు సినిమాల‌కి వారం రోజులు గ్యాప్ ఉంది. అలాగే రాధేశ్యామ్ కి, బంగార్రాజుకి కూడా వారం రోజులు గ్యాప్ ఉండాల‌ని కొంత మంది నిర్మాత‌లు అంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

అయితే.. నాగార్జున మాత్రం ఫ‌స్ట్ నుంచి సంక్రాంతికే బంగార్రాజు చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అందుచేత ఎట్టి ప‌రిస్థితుల్లోను బంగార్రాజు మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో బంగార్రాజు ఎప్పుడు వ‌స్తుంది.? సంక్రాంతికి వ‌స్తుందా..? లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది. అక్కినేని అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతుంది. మ‌రి.. రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts