ప్రభాస్ కోసం హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ సుందరి

ప్రభాస్ ఇంటర్నేషనల్ సినిమా ప్రాజెక్ట్ కె కోసం హైదరాబాద్ చేరుకుంది బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనే. ఇవాళ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఈ భామ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ ఇటీవలే ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సీన్స్ షూట్ చేశారు. తాజాగా దీపికా వంతు వచ్చింది. ఈ నెల 5 నుంచి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రాజెక్ట్ కె షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు సమాచారం.

ఈ మధ్యే రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ కూడా ప్రాజెక్ట్ కె కోసం ఫ్రీ అయ్యాడు. ఈ నెల 7 నుంచి ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. వైజయంతీ మూవీస్ సంస్థలో దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రాజెక్ట్ కెను అంతర్జాతీయ స్థాయి చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

Related Posts