ఆండ్రియా న్యూడ్ ఫొటో షూట్‌… డిలీట్ చేసిన మిస్కిన్‌!

సినిమాల్లో న్యూడ్‌గా యాక్ట్ చేయ‌డం ఇప్పుడు న‌యా ట్రెండ్‌. ఆ మ‌ధ్య అమ‌లాపాల్ న‌టించింది. పీకేలో ఆమీర్‌, ఒంగోలు గిత్త‌లో ప్ర‌కాష్‌రాజ్‌, ఈ మ‌ధ్య ఫొటోషూట్ కోసం ర‌ణ్‌వీర్‌, లైగ‌ర్ పోస్ట‌ర్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూడ్‌గా క‌నిపించారు.


త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న పిశాచి2లో ఆండ్రియా కూడా నగ్న ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌బోతుంద‌ని కోలీవుడ్ కోడై కూసింది. నిజంగానే ఆండ్రియా న‌గ్నంగా న‌టించిందా? అందుకోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.


లేటెస్ట్ గా దీని గురించి స్పందించాడు డైర‌క్ట‌ర్ మిస్కిన్‌. పిశాచి2లో ఆండ్రియాని న‌గ్నంగా న‌టించ‌మ‌ని అడిగిన మాట వాస్త‌వ‌మేన‌ట‌. సిట్చువేష‌న్ డిమాండ్‌ని అర్థం చేసుకున్న ఆండ్రియా అందుకు ఓకే చెప్పేసింద‌ట‌. అయితే, దానికి ఎక్కువ డ‌బ్బు కూడా అడిగింద‌ట‌. ఇదంతా జ‌రిగిన త‌ర్వాత ఎందుకో మిస్కిన్‌కి న్యూడ్ సీన్స్ పెట్టాల‌నిపించ‌లేద‌ట‌. వెంట‌నే, త‌న‌కూ ఆండ్రియాకు బాగా ప‌రిచ‌య‌మైన సుంద‌ర్ అనే ఫొటోగ్రాఫ‌ర్‌ని పిలిచి న్యూడ్ ఫొటోషూట్ చేయించార‌ట‌.

ఆ టైమ్‌లో తాను అక్క‌డ లేన‌ని, త‌న లేడీ అసిస్టెంట్, సుంద‌ర్ మాత్ర‌మే ఉన్నార‌ని ఆ పిక్స్ ని తాను అస‌లు చూడ‌లేద‌ని చెప్పాడు మిస్కిన్.అయితే సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ పిక్స్ వాడాలా వ‌ద్దా అనే డైలమా మిస్కిన్‌లో పెరిగింద‌ట‌. న్యూడ్ పిక్స్ ఉంటే సెన్సార్ ఎ స‌ర్టిఫికెట్ ఇస్తుంది. పిల్ల‌లు సినిమాకు దూర‌మ‌వుతారు. అది ఇష్టం లేక‌నే పిక్స్ ని డిలీట్ చేశార‌ట టీమ్ మెంబ‌ర్స్.ఆండ్రియా న్యూడ్ పిక్స్ గురించి వైర‌ల్ అవుతున్న న్యూస్‌లో బిహైండ్ ద స్క్రీన్ జ‌రిగింది ఇదే..

Related Posts