మహాశివరాత్రి కానుకగా ‘కల్కి‘ నుంచి స్పెషల్ అప్డేట్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకున్న రెబెల్ స్టార్ ‘కల్కి‘ నుంచి ఈరోజు స్పెషల్ అప్డేట్ వస్తోంది. ‘కల్కి‘ చిత్రంలో ప్రభాస్ పోషించే పాత్రను ఈరోజు 5 గంటలకు రివీల్ చేయబోతున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. పురాతన శివలింగంతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ‘కల్కి 2898 ఎ.డి‘ సినిమా టైటిల్ లో ఫ్యూచరిస్టిక్ అప్పీల్ ఉన్నా.. ఈ సినిమా కథ మన పురాణాలతో సంబంధం ఉన్నదే. ఆరువేల సంవత్సరాల స్పాన్ తో ఈ సినిమాని మహాభారతంతో మొదలుపెట్టి ఫ్యూచర్ లో ఎండ్ చేయబోతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మరి.. ఈ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ పోషించే పాత్ర ఏంటి? అనేది ఈరోజు తెలియనుంది.

Related Posts