విశ్వక్ సేన్ విలక్షణమైన ప్రయత్నం ‘గామి’

విశ్వక్ సేన్ అనగానే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ గుర్తుకొస్తాయి. అయితే.. ఈసారి తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా విలక్షణమైన అఘోరా పాత్రతో రాబోతున్నాడు. ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘గామి’. ఈ మూవీలో అఘోర శంకర్‌ గా విశ్వక్‌సేన్‌ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.

‘గామి’ ఫస్ట్ లుక్, మేకింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్టు మేకింగ్ వీడియోని బట్టి తెలుస్తోంది. చాందిని చౌదరి మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాని కార్తీక్ శబరీష్ నిర్మిస్తుండగా.. యు.వి.క్రియేషన్స్ విడుదల చేస్తుంది. మార్చి 8న ‘గామి’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts