సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాల రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు.

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను “అత్తమ్మ కిచెన్” ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా “అత్తమ్మ కిచెన్”ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు.

Related Posts