‘ఫైటర్‘ కథతోనే ‘ఆపరేషన్ వాలెంటైన్‘

సినిమా అనేది కోట్లతో ముడిపడిన వ్యవహారం. అందుకే.. కథ మొదలుకొని నటీనటుల వరకూ ప్రతీ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు దర్శకనిర్మాతలు. అయినా.. కొన్నిసార్లు అనుకోనివి జరుగుతుంటాయి. అందులో ఒకటి.. ఒకే కథతో రెండు సినిమాలు రూపొందడం. లేటెస్ట్ గా ‘ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్‘ చిత్రాల విషయంలో అదే జరిగింది.

ఈ ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైంది హృతిక్ రోషన్ ‘ఫైటర్‘. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ మూవీ ఆద్యంతం ఏరియల్ యాక్షన్ గా తెరకెక్కింది. 2019లో జరిగిన పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఈ చిత్రం వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఫైటర్‘కి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. ఆశించిన విజయం సాధించలేదు.

ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్‘ కథ కూడా ఇదే. ‘ఫైటర్‘ తరహాలోనే పుల్వామా ఇన్సిడెంట్ నేపథ్యంతోనే ‘ఆపరేషన్ వాలెంటైన్‘ వస్తోంది. ఈ రెండు సినిమాలూ లుక్ పరంగా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇక.. ‘ఆపరేషన్ వాలెంటైన్‘ హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదలవుతోంది. మరి.. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ‘ఆపరేషన్ వాలెంటైన్‘ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Related Posts