‘హరిహర వీరమల్లు‘ మొదలై నాలుగేళ్లయ్యింది!

భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల విషయంలో జాప్యం అనేది అరుదుగా జరిగే విషయమే. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ది ప్రత్యేకమైన కథనం. డైరెక్టర్ సిద్ధంగా ఉన్నా.. నిర్మాత సిద్ధంగా ఉన్నా.. హీరో అందుబాటులో లేక ఈ చిత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన తయారయ్యింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మొదలైన ‘హరిహర వీరమల్లు‘ ఇప్పటివరకూ పూర్తయ్యింది కేవలం 50 శాతం మాత్రమే. ఇంకా.. సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

కోవిడ్ రూపంలో ఈ పీరియడ్ డ్రామాకి ఫస్ట్ బ్రేకులు పడ్డాయి. ఆ సమయంలో డైరెక్టర్ క్రిష్ ‘కొండపొలం‘ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల కూడా చేశాడు. అలాగే.. పవర్ స్టార్ కూడా ‘హరిహర వీరమల్లు‘ కంటే వెనుక మొలుపెట్టిన సినిమాలను ప్రేక్షకుల ముందు నిలిపిన సందర్భాలూ ఉన్నాయి. కానీ.. ‘హరిహర వీరమల్లు‘ మాత్రం అలాగే ఉంది.

ప్రస్తుతం రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్.. ఎన్నికలు పూర్తైన తర్వాత ‘హరిహర వీరమల్లు‘తో పాటు ‘ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్‘ చిత్రాలను కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ లెక్కన చూసుకుంటే.. ‘హరహర వీరమల్లు‘ రావడానికి ఇంకా ఎలా లేదన్నా సంవత్సరంన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంమీద.. పవర్ స్టార్ కెరీర్ లోనే ఎక్కువ సంవత్సరాలు చిత్రీకరణ దశలో ఉన్న సినిమాగా ‘హరిహర వీరమల్లు‘ ఓ రికార్డు సృష్టించబోతుంది.

Related Posts