జూన్ 25న ‘భారతీయుడు 2‘ ట్రైలర్

విశ్వనటుడు కమల్ హాసన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2‘. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 12న విడుదలకు ముస్తాబవుతోంది. ఈనేపథ్యంలో.. ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

జూన్ 25న ‘భారతీయుడు 2‘ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఇక.. ఈ మూవీ ట్రైలర్ 2 నిమిషాల 36 సెకండ్ల నిడివితో ఉంటుందనే హింట్ ఇప్పటికే వచ్చింది. అలాగే.. జూన్ 30న హైదరాబాద్ లో ‘భారతీయుడు 2‘ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts