కాశ్మీర్ వ్యాలీలో ‘మిస్టర్ బచ్చన్‘ డ్యూయెట్

మాస్ మహారాజ రవితేజ సినిమాల స్పీడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ హీరోలలో జెట్ స్పీడులో సినిమాలు చేసేది రవితేజ ఒక్కడే. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్‘ మూవీ చేస్తున్నాడు రవితేజ. బాలీవుడ్ మూవీ ‘రైడ్‘కి రీమేక్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజైన షో రీల్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

గత నాలుగు రోజుల నుంచి ఈ సినిమాకోసం కాశ్మీర్ వ్యాలీలో ఓ మెలోడియస్ డ్యూయెట్ ను చిత్రీకరిస్తున్నారట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారట. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లొకేషన్ నుంచి మాస్ మహారాజ ఫోటో ఒకటి రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో రవితేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ ఏడాది ద్వితియార్థంలో ‘మిస్టర్ బచ్చన్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts