శ్రుతీ హాస‌న్‌తో బాల‌కృష్ణ సెల్ఫీ.. ఫొటో వైర‌ల్‌

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. గ‌త ఏడాది కోవిడ్ త‌ర్వాత థియేట‌ర్స్‌కు జ‌నాలు రార‌ని అంద‌రూ అంటుంటే, ‘అఖండ’ సినిమాతో రూ.200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి.. మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నిరూపించారు. ఆ సినిమా హిట్ ఇచ్చిన ఉత్సాహం నంద‌మూరి అభిమానుల‌కు ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడ‌దే ఊపుతో బాల‌కృష్ణ త‌న 107వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రుతీ హాస‌న్ హీరోయిన్. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.

NBK 107 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. లొకేష‌న్‌లో బాల‌కృష్ణ‌, శ్రుతీ హాస‌న్‌ల‌తో గోపీచంద్ మ‌లినేని క‌లిసి ఉన్న ఫొటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. బాల‌కృష్ణ న‌టుడిగా త‌న కెరీర్ స్టార్ట్ చేసి 48 ఏళ్లు అవుతుంది. ఈ సంద‌ర్భంగా గోపీచంద్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమాలో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని టాక్‌. ఇప్ప‌టికే అందులో ఓ పాత్ర‌కు సంబంధించిన మాస్ లుక్‌, ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అఖండ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ డిసెంబ‌ర్‌లోనే NBK 107ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Related Posts