సల్మాన్ ఖాన్ వెయ్యి కోట్లు కొట్టేనా?

బాలీవుడ్ లో ఖాన్ త్రయంగా చెప్పబడే.. సల్మాన్, అమిర్, షారుఖ్ ఖాన్ ల ఆధిపత్యానికి తిరుగేలేదు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా.. హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంత మంది హీరోలు వచ్చినా.. అగ్ర స్థానం మాత్రం ఈ ముగ్గురు ఖాన్ లతోనే దోబూచులాడుతూ వచ్చింది. ఇక ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఖాన్.. తమ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వచ్చారు.

అయితే.. గత కొంత కాలంగా ఈ ముగ్గురు ఖాన్ లు వరుస పరాజయాలతో సతమతమయ్యారు. వీరిలో షారుఖ్ ఖాన్ మాత్రం ఈ ఏడాది ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సంవత్సరం విడుదల చేసిన రెండు సినిమాలతోనూ బాక్సాఫీస్ వద్ద వెయ్యిసి కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు సల్మాన్ వంతొచ్చింది.

సల్మాన్ నటించిన చిత్రాల్లో.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండు వందలు, మూడు వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక.. చైనా బాక్సాఫీస్ కూడా కలుపుకుంటే సల్మాన్ ‘భజరంగి భాయ్ జాన్’ ఏకంగా రూ.900 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అయితే.. ఇప్పటివరకూ సల్మాన్ ఖాతాలో వెయ్యి కోట్లు సినిమా మాత్రం లేదు. ‘టైగర్ 3’తో ఆ కోరిక నెరవేరుతుందనేది బాలీవుడ్ క్రిటిక్స్ మాట. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో ‘టైగర్ 3’పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related Posts