మలయాళం ఇండస్ట్రీలో మరో వంద కోట్ల చిత్రం

మలయాళం ఇండస్ట్రీ మంచి దూకుడు మీదుంది. ఈ ఏడాది మిగతా ఇండస్ట్రీలలో పెద్దగా విజయాలు లేకపోయినా.. మాలీవుడ్ నుంచి మాత్రం బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం‘ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూళ్లు సాధించాయి. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం‘ కూడా చేరబోతుంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా వంద కోట్లు మార్కును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్.

ఈ ఏడాది మలయాళంలో అద్భుతమైన విజయాలు సాధించిన ‘ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం‘ తెలుగులోనూ అనువాద రూపంలో అలరించాయి. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం‘ చిత్రాన్ని కూడా తెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలా? రీమేక్ చేయలా? అనే సంశయంలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే ‘ఆవేశం‘ తెలుగు వెర్షన్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts