దేవరకొండ బ్రదర్స్ కు దెబ్బ మీద దెబ్బ..

విజయ్ దేవరకొండ.. చాలా ఫాస్ట్ గా దూసుకువచ్చిన తెలుగు హీరో. బట్ అంతే ఫాస్ట్ గా డల్ అవుతున్నాడు. ఓవర్ యాటిట్యూడ్ మనోడి కొంపలు ముంచుతోంది అనేది నిజం. కానీ అతనవేవీ పట్టించుకోవడం లేదు. తనేదో బై బర్తే ఇలా ఉన్నట్టుగా బిహేవ్ చేశాడు.. చేస్తున్నాడు. దీంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది నిజం. అలాంటివి సినిమాల విజయంపై ప్రభావం చూపుతాయని మనోడికి లేటెస్ట్ గా లైగర్ మూవీతో బాగా తెలిసొచ్చింది. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. అందులో డౌట్ లేదు. ప్రమోషన్స్ లోనూ దేశవ్యాప్తంగా విపరీతంగా తిరిగాడు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్న చేశాడు.

ఈ ప్రయత్నంలో విజయ్ చూపించిన యాటిట్యూడ్ కు చాలామంది నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రమోషన్స్ లో జర్నలిస్ట్ ల ముందు టేబిల్ కాళ్లు వేసి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. దానికి ముందు వెనక ఏం జరిగిందీ అనేది కామన్ పీపుల్ కు అనవసరం. బట్.. ఆ మూమెంట్ తో అతను చాలా బ్యాడ్ అయ్యాడు. దీనికి తోడు” నా తండ్రెవడో తెల్వదు, నా తాతెవడో తెల్వదు.. అయినా నన్ను సపోర్ట్ చేస్తున్నారం”టూ.. నెపోటిజం గురించి మాట్లాడి మరింత అభాసుపాలయ్యాడు.

ఎందుకంటే తను ఎదుగుతోన్న దశలోనే తమ్ముడిని తీసుకువచ్చాడు కదా.. మరి అది నెపోటిజం కాదా అని జనం రివర్స్ లో అటాక్ మొదలుపెట్టారు. పైగా అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. విజయ్ లాగా టాలెంటెడ్ కాదు. అందగాడు అంత కన్నా కాదు.. అయినా ఆడియన్స్ పై రుద్దుతున్నాడు కదా.. అంటూ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు.


అయితే ఓ విషయం గమనిస్తే.. ఈ అన్నదమ్ములిద్దరి కెరీర్ ఇప్పుడు చాలా వేగంగా డౌన్ ఫాల్ అవుతోంది. విజయ్ కి లైగర్ తో కలిపి నాలుగో డిజాస్టర్ పడింది. రాబోయే ఖుషీ సినిమాపై ఎన్ని హోప్స్ పెట్టుకున్నా.. అది టాలీవుడ్ ను దాటి వెళుతుందని చెప్పలేం. దాటినా సగం సక్సెస్ సమంత అకౌంట్ లోనే పడుతుంది.
ఇక ఇటు విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా తన కెరీర్ ను హైవే ఎక్కించాలని అనేక ప్రయత్నాలు చేస్తోన్నా అదింకా డొంక దారుల్లోనే తచ్చాడుతోంది. కంటెంట్ ఉన్నప్పుడు కలరింగ్ ఇస్తే తప్పు లేదు. తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టుగా.. విషయం ఉన్నా కూడా.. ఓవరాక్షన్ చేయొద్దు. యాటిట్యూడ్ కు యారోగెన్స్ కు, ఆత్మవిశ్వాసానికి – అహంకారానికి తేడా తెలియనంత పిచ్చోళ్లు కాదు జనం. మరి ఈ లైగర్ పంచ్ తో అయినా విజయ్ దేవరకొండ ఓవరాక్షన్ చేయకుండా సినిమాల గురించి కామ్ గా పనిచేసుకుటే బెటరేమో.

Related Posts