రొమాంటిక్ అవతార్ లో రెచ్చిపోయిన నాగార్జున

కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే’ రేపు (డిసెంబర్ 10) ఉదయం 11 గంటల 35 నిమిషాలకు రాబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది టీమ్. హీరోహీరోయిన్లు నాగార్జున, ఆషిక రంగనాథ్ లపై చిత్రీకరించిన ఈ గీతంలో నవ మన్మథుడిలా రొమాంటిక్ అవతార్ లో రెచ్చిపోతున్నాడు కింగ్ నాగార్జున. చెట్లూ, పొలాలు, గోదావరి వంటి అందమైన లొకేషన్స్ లో కలర్ ఫుల్ గా చిత్రీకరించిన ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది.

ఆస్కార్ విజేత కీరవాణి సంగీత సారథ్యంలో మరో ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించాడు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు ఈ పాటను కొరియోగ్రాఫ్ చేసింది కూడా విజయ్ బిన్ని. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ
రెండు పాటలు, ఒక ఫైట్ చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుందట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts