‘బబుల్ గమ్‘ నుంచి విడుదలైన మరో పాట

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో రోషన్ కి జోడీగా మానస చౌదరి నటించింది. టీనేజ్ లవ్ స్టోరీగా రవికాంత్ పేరెపు ఈ సినిమాని తెరకెక్కించాడు. డిసెంబర్ 29న థియేటర్లలోకి రాబోతున్న ‘బబుల్ గమ్‘ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, రెండు సాంగ్స్ రిలీజయ్యాయి. లేటెస్ట్ గా మరో పాటను విడుదల చేసింది టీమ్.

తాజాగా ఈ సినిమా నుంచి ‘జానూ’ అంటూ సాగే మూడో పాట విడుదలైంది. శ్రీ చరణ్ పాకాల స్వరపరిచిన ‘ఎందుకే ఈ ఆలోచన.. నాకు ఈ రోజున’ అంటూ సాగే ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. జావేద్ ఆలీ ఆలపించాడు. ప్రేయసి ఎడబాటును.. ఆమె జ్ఞాపకాలను
తలచుకుంటూ హీరో పాడుకునే గీతంగా సినిమాలో ఈ పాట ఉండబోతుంది.

Related Posts