సర్కార్ తో కలిసి బార్డర్స్ దాటుతోన్న కీర్తి సురేష్ ..

కీర్తి సురేష్.. ఇప్పటి వరకూ సంప్రదాయమైన పాత్రలతోనే ఆకట్టుకున్న బ్యూటీ. మహానటికి ముందు రెగ్యులర్ హీరోగా కనిపించినా.. అవన్నీ గాల్ నెక్ట్స్ డోర్ టైప్ రోల్స్. కొన్ని సినిమాల్లో ఎక్స్ ట్రీమ్ గా కనిపించినా.. పాత్రల్లోనే ఆగింది తప్ప పరిధులు దాటలేదు. ఎక్స్ పోజింగ్ అంటే ఆమడదూరం వెళ్లిపోయింది. మహానటితో తనలోని సిసలైన నటిని చూపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. ముఖ్యంగా తమిళ్ లో టాప్ స్టార్స్ తో చేసిన చిత్రాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి. దీంతో ఓటిటి సినిమాలతో కొన్నాళ్లు కాలక్షేపం చేసింది. అవి కూడా డిజాస్టర్ అనిపించుకున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన చిన్ని రొటీన్ స్టోరీ అయినా డిఫరెంట్ టేకింగ్ వల్ల ఆకట్టుకుంటోంది.. అదీ ఓటిటిలోనే.

https://www.youtube.com/watch?v=-o0r_MljIXg

ఈ తరుణంలో కీర్తి సురేష్ ఆశలన్నీ సర్కారువారి పాటపైనే ఉన్నాయి. నిజానికి ఈ చిత్రానికి తనే మెయిన్ మైనస్ అవుతుందని ముందు నుంచీ చాలామంది భావించినా.. కళావతి పాట నుంచి ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లోనూ కాస్త హాట్ గానే కనిపించిన కీర్తి లేటెస్ట్ గా వచ్చిన సర్కారువారి పాట ప్రోమోలో చూస్తే మతిపోయే మాస్ స్టెప్పులతో బాప్ రే అనిపిస్తోంది. ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఈ తరహాలో మాస్ స్టెప్పులు వేయలేదు. అటు మహేష్ సైతం చాలా రోజుల తర్వాత(సర్కారు పాట స్టెప్పులు కాస్త ఆర్టిఫిషియల్ గా ఉంటాయి) ఊరమాస్ స్టెప్పులతో ఊపేసేలా కనిపిస్తున్నాడు.

ఇక మరో విశేషం ఏంటంటే.. స్కిన్ షో పరంగా ఇప్పటి వరకూ కొన్ని హద్దుల్లో ఉన్న కీర్తి సురేష్ ఈ మూవీ నుంచి కాస్త బార్డర్స్ దాటుతున్నాను అనే హింట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ మాత్రం కూడా తను స్క్రిన్ షో చేయకపోవడంతో అమ్మడు కూడా అందరి రూట్లోకి వస్తోందంటున్నారు. అలాగని మరీ వల్గర్ గా కాకపోయినా పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించేందుకు సిద్ధమే అని హింట్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. అన్నట్టు ఈ సినిమాలో ఈ పాటే మెయిన్ హైలెట్ అంటున్నారు. థియేటర్ అంతా ఊగిపోతుందీ పాటకు అనుకుంటున్నారు. మరి ఏ మాత్రం ఊపుతుందో కానీ.. కీర్తి సురేష్ మాత్రం ఖచ్చితంగా ఊరమాస్ స్టెప్పులతో ఓ రేంజ్ లో ఆశ్చర్యపరిచేలా ఉంది.

Related Posts