ఈ సినిమా థియేటర్ కదులుతుంది..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు.. నిజమే.. మనిషి మళ్లీ వెనక్కి వెళ్లేది ఆ గోల్డ్ కోసమే. ఒకప్పుడు.. ఈ డిజిటల్ ప్రపంచం లేని టైమ్ లో గ్రామాల్లో చిన్న తెరకట్టి ప్రొజెక్టర్ తో సినిమాలు ఆడించేవారు. వాళ్లు ఊరూరూ తిరుగుతూ ఆ సినిమాలను ప్రదర్శించారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే అదే. వెస్ట్రన్ కంట్రీస్ లో దాన్నో అద్భుతంగా చెప్పుకున్నారు కానీ.. మనవాళ్లు సింపుల్ గా చేసి పడేశారు. ఊళ్లో ఓ ఓపెన్ ప్లేస్ చూసుకుని కాస్త ఎక్కువమంది పట్టేలా ఉన్న స్థలంలో.. ప్రోజెక్టర్ పెట్టి.. చుట్టూ సౌండ్ బయటకు వెళ్లకుండా ప్లాస్టిక్ లేదా టెంట్ క్లాత్ ల వంటివి కట్టేసి.. టికెట్ కొనుకున్నవాళ్లను అందులోకి పంపించేవారు. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వస్తున్నాయి.. వస్తున్నాయి ఏంటీ.. వచ్చేశాయి కూడా. ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ మూవీ ఆచార్యతో ఈ కొత్త కదిలే థియేటర్ మొదలు కాబోతోంది.


ఒకప్పుడు లాగానే ఈ థియేటర్ ను కూడా ఏదైనా వాహనంలో వేసుకుని వెళుతూ ఎక్కడంటే అక్కడ సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. కాకపోతే ఇది నేటి టెక్నాలజీని కూడా పూర్తిగా అందిపుచ్చుకుని మొదలు కాబోతోన్న మొబైల్ థియేటర్. ఏపిలోని రాజా నగరం హైవే దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ లో ఈ థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. అప్పట్లో టెంట్ కు బదులుగా ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ సౌకర్యం ఉన్న పద్ధతిని వాడుతున్నారు.అంటే చుట్టూ ఉండే గోడ లాంటి వస్తువులో గాలిని నింపితే అది హాల్ లా మారుతుంది. పైగా ఇది వెదర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా. మొత్తం 120మంది ఒకేసారి సినిమా చూసేలా సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.

పిక్చర్స్ డిజిటల్స్ అనే సంస్థ దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఈ నెల 29నుంచి ఆచార్య సినిమాను ఈ మొబైల్ థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. మొత్తంగా ఇదో మినీ టూరింగ్ టాకీస్ లాంటిది అనుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. కొన్ని రోజుల తర్వాత మొత్తం సర్దేసుకుని ఓ ట్రక్ లో వేసుకుని మరో ప్లేస్ కు వెళ్లి సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. అందుకే దీన్ని మొబైల్ థియేటర్ అన్నారు. ఏదేమైనా ఇంకెన్ని వింతలు వస్తున్నాయో

Related Posts