ఈ రొమాంటిక్ కపుల్ మ్యాజిక్ చేస్తారా..

ఒకరేమో బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నారు. మరొకరు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నారు. ఇద్దరికీ రొమాంటిక్ అన్న ఇమేజ్ ఉంది.అలాంటి ఇద్దరు కలిసి నటించినప్పుడు ఆ ఇమేజ్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా.. ? ఆడియన్స్ సంగతేమో కానీ.. సదరు చిత్ర దర్శకుడు మాత్రం అలాగే భావించినట్టు కనిపించింది. అందుకే ఈ సినిమాలో ఇద్దరూ మరోసారి రెచ్చిపోయారు.

ఈ ఇద్దరూ ఎవరో ఇప్పటికే గెస్ చేసి ఉంటారు కదా.. యస్.. హిట్ కొట్టిన బ్యూటీ నేహాశెట్టి, హిట్ కొట్టాల్సిన హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తర్వాత మరో సాలిడ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు కార్తికేయ. వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బట్.. కలిసి రావడం లేదు. ఇటు 2018 నుంచి ట్రై చేస్తోంటే లాస్ట్ ఇయర్ డిజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకుంది నేహా శెట్టి.

ఈ మూవీలో అమ్మడి నటన, గ్లామర్ కు ఫిదా కాని వారు లేరు. చివర్లో కాస్త నెగెటివ్ టచ్ ఉన్నా.. అది ఆమె ఇమేజ్ పై ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నారు. ఈ నెల 25న విడుదల కాబోతోందీ సినిమా.


క్లాక్స్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ మూవీ 2012లో యుగాంతం జరుగుతుందన్న భారీ పుకార్ల నేపథ్యంలో అల్లుకున్న విలేజ్ డ్రామా అని చెబుతున్నారు. ఇలాంటి పుకార్లకు విలేజ్ డ్రామా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. దానికి మూఢ నమ్మకాలు, దేవుళ్లు, దెయ్యాలు అంటూ అదనంగా మరికొన్ని ఎలిఎమెంట్స్ యాడ్ చేసినట్టున్నాడు దర్శకుడు.

ఇవి కూడా సమపాళ్లలో ఉంటే ఖచ్చితంగా వర్కవుట్ అవుతాయి. ట్రైలర్ ఆకట్టుకుంది. పాటలు బావున్నాయి. కార్తికేయ, నేహా మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తోంది. తను కూడా ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డట్టు కనిపిస్తోంది. వీటికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. తన కెరీర్ లో ఇదే బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే మాట చెప్పి అంచనాలు పెంచాడు. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.

ఎలా చూసినా బెదురులంక 2012 పాజిటివ్ వైబ్స్ తోనే కనిపిస్తోంది. కానీ కార్తికేయ గత సినిమాల రిజల్ట్స్ వల్ల అనుకున్నంత బజ్ అయితే రాలేదు అనే చెప్పాలి. కాకపోతే ఇలాంటి సినిమాలకు మొదటి ఆటకు హిట్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా సాయంత్రానికి థియేటర్స్ ఫుల్ అవుతాయి. ఆ మాట తెచ్చుకునే పనిలో వీరు సక్సెస్ అయితే ఈ సినిమాను సక్సెస్ చేయడానికి ఆడియన్స్ ఏ మాత్రం మొహమాటపడరు.

Related Posts