భోళా రేజ్ డామేజ్ చేసిందా..

ఊహించినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాకు ఏ మాత్రం బజ్ రావడం లేదు. మరోవైపు బుకింగ్స్ లో డబ్బింగ్ సినిమా జైలర్ డామినేషన్ కనిపిస్తోందనే వార్తలూ ఉన్నాయి. ఈ మూవీ రీమేక్ కావడం, మెహర్ రమేష్ దర్శకుడు కావడంతో పాటు ఇప్పటి వరకూ వచ్చిన పాటల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోకపోవడంతోనే భోళాకు ఆశించినంత బజ్ లేదు.

ఈ బజ్ ను పెంచడానికి తాజాగా భోళా రేజ్ అంటూ మరో సాంగ్ విడుదల చేశారు. కానీ ఇది ప్లస్ అవడం కంటే ఎక్కువ మైనస్ అయింది. అస్సలే మాత్రం బాలేదు. పైగా ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలను ఫాలో అవుతున్నట్టుగా ఉంది. మెగా సినిమాకు ఇలాంటి పాటలతో లేపాల్సిన పనిలేదు. చూస్తోంటే ఈ పాట సినిమాలో ఉండేది కాదు అని అర్థంఅవుతుంది.ఆ మాత్రం దానికి మరింత ఖర్చుపెట్టి ఈ పాటను చిత్రీకరించడం ఏంటో కానీ.. ఈ పాట చూస్తే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కోసం సునిల్, ఆదితో చేసిన ‘అనవసర’ హడావిడీ మాత్రం కనిపిస్తోంది.


మెహర్ రమేష్ ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ పాట కంటే మరో ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. కనీసం కీర్తి సురేష్ పార్ట్ నుంచి ఏదైనా అప్డేట్ చేసినా ఎక్స్ ట్రా అట్రాక్షన్ యాడ్ అయ్యేది. ఈ పాట వల్ల భోళా రేజ్ కంటే బాగా డామేజ్ జరిగిందనే మెగా ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏది పడితే అది వదిలితే అసలుకే మోసం వస్తుంది.

Related Posts