ఒక్క ముల్లు కూడా లేని డేంజర్ పిల్ల

నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తోన్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ పాడాడు. హారిస్ స్టైల్లో ఈ పాట సూతింగ్ మెలోడీగా వినిపిస్తోంది. పాటలోని ప్రతి అక్షరం వినిపించేలా ఆర్కెస్ట్రైజేషన్ ఉంది.

ముఖ్యంగా సాహిత్యం హీరో క్యారెక్టర్ ను తెలుపుతూనే అతను హీరోయిన్ గురించి చెబుతున్నట్టుగా ఉంది. క్యారెక్టర్స్ ను కూడా తెలిపేలా అర్థవంతంగా ఉంది సాహిత్యం. డేంజర్ పిల్ల అనే మెయిన్ లైన్ తో కనిపిస్తోన్న ఈ పాట నితిన్ కు బాగా సెట్ అయింది. శ్రీ లీల ఎప్పట్లానే అందంగా ఉంది. కాకపోతే ఈ పాటలో తన డ్యాన్స్ పోర్షన్ చాలా తక్కువగా ఉన్నట్టుంది.


“నాకే నేనే బోరే కొట్టే మనిషినే.. ఏమైందో ఫస్ట్ లుక్కులోనే నీకే పడితినే.. నచ్చిందే చేస్తు ఉంటా.. అందాక తింటా పంటా.. టెన్షన్లు మోసే తంటా లేదంటా ఇంటా వంటా.. షో మ్యానే అంటారంతా.. డేంజర్ పిల్లా.. ఏంజెల్ లాగా డ్యూయొల్ రోలా..” సాగే మొదటి చరణం ఆకట్టుకుంది. దీనికి మించి అనేలా రెండో చరణంలో ” ఓ ముద్దు అప్పిస్తావా పొద్దున్నే చెల్లిస్తాలే.. వడ్డీగా ఇంకోటిస్తా పెదవులు అడిగితే.. అమ్మాయి హగ్గిస్తావా దూరాన్నే తగ్గిస్తావా దునియానే ఏలేస్తానే నీకు నాకు కుదిరితే..

రాసేసుకుంటానే వందేళ్లకి కథ ఏదైన నువ్వేలే నా నాయక .. కావ్యాలు చాలేనా నీ కళ్లకి.. కనిపించాలి వాటిల్లో నా బొమ్మ.. ప్రేమా ప్రేమా.. ” అంటూ సాగుతుంది. తన క్యారెక్టర్ ను తెలుపుతూనే తనెంత ప్రేమిస్తున్నాడో చెబుతూ హీరో పాడుకునే పాటలా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట మొత్తం ఫారెన్ లొకేషన్ లోనే చిత్రీకరించారు. మొత్తంగా ఎక్స్ ట్రార్డినరీ అనలేం కానీ మెల్లగా ఎక్కే మెలోడీలా ఉందీ ఎక్స్ ట్రా ఆర్టినరీ మేన్ పాట.

Related Posts