యస్ మీరు చదివింది కరెక్టే. నాగ చైతన్య కొత్తగా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. నిజమే ఆయనకు అవసరమే అని మీకు అనిపిస్తే అది మా తప్పు కాదు. బట్ నిజంగానే చైతూ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. నిజానికి యాక్టింగ్ స్కూల్ లాంటి అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా వచ్చాడు చైతన్య. బట్ అందరికీ అది రావాలనేం లేదు కదా.. ఆ మాటకొస్తే ఏఎన్నార్ కు తగ్గ వారసుడు అనిపించుకోవడానికి నాగార్జునకు కూడా చాలాకాలమే పట్టింది.
మరి ఇప్పుడు నాగార్జున వారసుడు నాగ చైతన్య అనిపించుకునే సినిమా ఒక్కటైనా వచ్చిందా.. అంటే లేదు అనే చెబుతాం. అతని కటౌట్ కు తగ్గ కథలే ప్రయత్నిస్తున్నాడు. మొదట్లో మాస్ హీరో కావాలనుకున్నాడు. కానీ అదే కటౌట్ సరిపోలేదు. అందుకే కొన్నాళ్లుగా కాస్త మాస్ టచ్ కాస్త ఎక్కువ క్లాస్ టచ్ ఉన్న స్టోరీస్ తో వెళుతున్నాడు. అయితే నటన పరంగా చైతన్య ది బెస్ట్ అనిపించుకున్న సినిమాలు ఇప్పటి వరకూ లేవు. కొన్నాళ్లుగా చాలా బెటర్ అయ్యాడు అనే చెప్పాలి.
అయినా ఇంకేదో బెస్ట్ ఇవ్వాలని తనే భావించాడో లేక ఇంకెవరైనా చెప్పారో కానీ రీసెంట్ గా అతను పాండిచేరిలో ఉన్న ప్రముఖ థియేటర్ కు వెళ్లాడు. థియేటర్ అంటే సినిమా హాల్ కాదు. సినిమాల్లో నటించేందుకు మెళకువలు చెప్పే యాక్టింగ్ స్కూల్ లాంటిది. పేరు ఆదిశక్తి థియేటర్. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తాడు. ప్రధానంగా నటన పరంగా ది బెస్ట్ ట్రెయినింగ్ ఇస్తారు అనే పేరుంది వీరికి. కొన్ని రోజులుగా చైతన్య అక్కడే ఉంటున్నాడు.
మామూలుగా సోషల్ మీడియాకు చాలా దూంగా ఉండే చైతన్య తాజాగా ఈ ప్లేస్ గురించి.. అక్కడి మనుషుల గురించి.. తను నేర్చుకున్న విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. నిజంగానే ఇండియాలోని బెస్ట్ థియేటర్స్ లో ఆదిశక్తి థియేటర్ కూడా ఒకటి. మరి అక్కడ నాగ చైతన్య ఏ విషయంలో ట్రెయినింగ్ తీసుకున్నాడో కానీ.. ఏ మనిషైనా తను ఎంచుకున్న రంగంలో మరింత గొప్పగా రాణించాలంటే అప్పుడప్పుడూ ఇలాంటివి అవసరమే.
ఇక చైతూ ప్రస్తుతం చందు మొండేటితో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందబోయే ఈ చిత్రం అతని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ లో రూపొందబోతోంది. మరోవైపు సామజవరగమనా దర్శకుడుతోనూ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయంటున్నారు.