అక్కినేని అఖిల్.. కుర్రాడు చూడ్డానికి బానే ఉన్నా.. టాలెంట్ పరంగా మాత్రం ఇంకా చాలా షైన్ అవ్వాల్సి ఉంది. ఆ షైనింగ్ లేకపోవడం వల్లే ఫస్ట్ హిట్ కోసం నాలుగైదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో విజయం అందుకున్నాను అనిపించుకున్నాడు. కానీ ఈ చిత్ర విజయంలో ఎక్కువ శాతం పూజాహెగ్డేకే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సినిమా కూడా మరీ ఏమంత బ్లాక్ బస్టర్ కాదు. జస్ట్ హిట్ అంతే. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఇలాంటి హిట్ కోసం అంత కాలం వేచి చూడాల్సి వచ్చిందంటేనే మనోడి టాలెంట్ అర్థం కావడం లేదూ. అఫ్ కోర్స్ కొత్తలో ఎవరికైనా కొంత టైమ్ పడుతుంది. బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. ఆ టైమ్ వచ్చే వరకూ లాగుతూనే ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు వెనక్కి వెళ్లిపోతుంటారు అంతే తేడా. ఇక ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ఇది. టైటిల్ ను బట్టి అతనో స్పై గా నటిస్తున్నాడని వేరే చెప్పక్కర్లేదు. ఈ పాత్ర కోసం ఏకంగా ఎయిట్ ప్యాక్ పెంచుకున్నాడు అఖిల్. కథ బలంగా ఉంటే బలమైన కండలు అక్కర్లేదు. కానీ లుక్ ఫిట్ గా ఉంటుందనే ఇలా పెంచుకున్నాడనుకోవచ్చు. అయితే ఈ కథ విషయంలో ఇప్పటికే అనేక మార్పులు జరిగాయి. మొదట అనుకున్న స్టోరీకి.. వస్తోన్న అవుట్ పుట్ కు మధ్య దూరం చాలా ఉందట. అయినా కసరత్తులు చేసి కథను ఓ కొలిక్కి తెచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నా.. అతని ఆస్థాన రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. అయితే ఏజెంట్ కు సంబంధించి లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ కథలో ఇన్ని మార్పులు చేయడానికి కారణం .. సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేయడానికే నట. ఏంటీ షాక్ అవుతున్నారా..? ఇంకా ఇక్కడే సరైన హిట్ కొట్టని అఖిల్ ఏకంగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఆకట్టుకోవాలని చూస్తున్నాడా..? అసలు అతనికి అంత సీన్ ఉందా అనుకుంటున్నారా..? దాందేముందీ.. కొన్నిసార్లు కొన్ని కలిసొస్తాయి. చెప్పలేం.. ఏ స్క్రిప్ట్ లో ఏ హిట్ ఉందో ఎవరికీ తెలియదు కదా..? సో.. ఇప్పుడు టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ అంటూ పలవరిస్తున్నారు కదా.. ఆ పలవరింతల్లో ఇప్పుడు అఖిల్ కూడా చేరాడన్నమాట.
|