Shruti Haasan :- శ్రుతి హాసన్ పర్సనల్ మేటర్స్ తో వెబ్ సిరీస్

మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్ మరో వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సారి హిందీలో. తన కెరీర్ మొదలుపెట్టింది కూడా హిందీలోనే కావడం విశేషం. ఇటు తెలుగులో ఆ మధ్య పిట్ట కథలు అనే సిరీస్ లో నటించినా అది ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్ లో తన పార్ట్ లో శ్రుతి హాసన్ చాలా బోల్డ్ గా నటించింది. కానీ హిందీలో నటిస్తోన్న వెబ్ సిరీస్ లో చాలా పద్ధతిగా కనిపిస్తున్నట్టుగా ఉంది. బెస్ట్ సెల్లర్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ సిరీస్ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
శ్రుతి హాసన్ ఇమేజ్ ను బట్టి చూస్తే తను వెబ్ సిరీస్ చేస్తుంది అనగానే చాలామంది బోల్డ్ కంటెంట్ ఉంటుందని భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ట్రైలర్ కనిపించింది. పైగా ఈ సిరీస్ ఎక్కువ భాగం తన చుట్టే తిరుగుతుంది. తనే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. హిందీలో చేతన్ భగత్ లా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ గా ఉన్న ఓ వ్యక్తిని ఆరాధిస్తూ ఉంటుంది శ్రుతి హాసన్. తనూ రచయిత కావాలనుకుంటుంది. పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన తను ఓ హోటెల్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆ హోటెల్ కు ఓసారి తన అభిమాన రచయిత వస్తాడు. అతనితో పరిచయం పెంచుకుని తన గతం చెబుతుంది. ఆ గతంలో తను చిన్న వయసులోనే తండ్రి, టీనేజ్ లోనే పెళ్లి చేయడంతో భర్త వల్ల అనేక ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి తన పర్సనల్ ఇష్యూస్ అన్నీ రచయితతో షేర్ చేసుకుంటుంది. ఆ నేపథ్యంలో ఓ నవల రాస్తాను అంటాడతను.
రైటర్ నవల స్టార్ట్ చేశాకే అనూహ్యమైన పరిణామాలు జరుగుతుంటాయి. అప్పటి నుంచి శ్రుతి హాసన్ పై ఎటాక్స్ మొదలవుతాయి. చాలామంది దీని వెనక రచయితే ఉన్నాడనుకుంటారు. రంగంలోకి పోలీస్ డిపార్ట్ మెంట్ దిగుతుంది. �