ప్రభాస్ కు మళ్లీ షాక్ ఇస్తాడట

ఒక చిన్న దర్శకుడు.. తన సినిమాతో ప్రభాస్ కు షాక్ ఇస్తాను అంటున్నాడు. అందుకు కారణం.. అతని వెనక ప్రభుత్వమే ఉండటం. ప్రభుత్వమే అండగా ఉన్న ఆ చిన్న దర్శకుడు ఎవరా అనుకుంటున్నారు కదా..? ఆ మధ్య అభూత కల్పనలు, అంతులేని అబద్ధాలతో కశ్మీర్ ఫైల్స్ అనే అసంబద్ధమైన సినిమా తీసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

కశ్మీర్ లోని పండిట్స్ ఊచకోత నేపథ్యంలో చేసిన కశ్మీర్ ఫైల్ కంట్రీ మూడ్ ను బట్టి.. కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. అయితే కంటెంట్ మేకింగ్ పరంగా మాత్రం దారుణంగా ఉంటుందా సినిమా. కథనం నేలబారుగా ఉంటుంది. టేకింగ్ అస్సలు బాగోదు. అయినా కొన్ని సంస్థలు పనిగట్టుకుని మరీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశాయి.

కొన్ని రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు అద్భుతం అంటూ కితాబులు ఇస్తూ.. ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇచ్చారు. దీంతో తనేదో గొప్ప దర్శకుడిని అనే భ్రమల్లోకి వెళ్లిపోయాడు వివేక్. పైగా తనను తాను కట్టర్ హిందూగా చెప్పుకుంటూ బిజెపికి భజన చేస్తుండటం ముందు నుంచీ ఉంది. అది అతని వ్యక్తిగతం. ఆ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ సలార్ కు షాక్ ఇస్తా అంటూ రాబోతున్నాడు.


తాజాగా వివేక్ అగ్నిహోత్రి.. కరోనా నేపథ్యంలో ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమా రూపొందించాడు. ఈ చిత్రాన్ని సరిగ్గా సలార్ విడుదలయ్యే రోజే అంటే సెప్టెంబర్ 28నే విడుదల చేస్తా అంటూ ప్రకటించాడు. మరి ఈ సినిమా వస్తే సలార్‌ కు షాక్ తప్పదా.. అనే చర్చలు నడుస్తున్నాయి. అందుకు కారణమూ లేకపోలేదు. ఇంతకు ముందు అతను తీసిన కశ్మీర్ ఫైల్స్ ను ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదల రోజే రిలీజ్ చేశాడు.

రాధేశ్యామ్ పోయింది. కశ్మీర్ ఫైల్స్ వందల కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందనే దీమా అతనిలో కనిపిస్తుంది. అది తన సినిమాపై నమ్మకంతో కూడిన దీమా అయితే ఫర్వాలేదు. కానీ అతను ప్రభాస్ సలార్ పై విమర్శలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు అంతా తను తీసే తరహా చిత్రాలను మాత్రమే ఆదరిస్తున్నారు..

హీరోయిజం చూపించే కథలను పట్టించుకోవడం లేదంటూ కమెంట్స్ చేస్తున్నాడు. మరి అదే నిజమైతే బాలీవుడ్ లోనే వచ్చిన పఠాన్ వెయ్యి కోట్లు ఎలా కొల్లగొట్టిందో ఈయన చెబుతాడా.. ఏదేమైనా అతని కమెంట్స్ పై నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.. ట్రోల్ చేస్తున్నారు. మరి నిజంగానే అతను సలార్ ను ఢీ కొడుతూ.. తన ది వ్యాక్సిన్ వార్ ను సెప్టెంబర్ 28నే విడుదల చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Posts