కళ్యాణ్‌ రామ్ డెవిల్.. అదిరిపోయింది..

నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా అతని లేటెస్ట్ మూవీ డెవిల్ నుంచి ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ అంటే ఏదో అప్డేడ్ లా ఉంటుందనుకున్నారు చాలామంది. కానీ అదిరిపోయే వీడియో విడుదల చేశారు మేకర్స్.

స్వాతంత్ర్యానికి పూర్వ కాలంలో బ్రిటీష్‌ వారికి ఓ సీక్రెట్ ఏజెంట్ ఉండేవాడు. పేరు డెవిల్. అంటూ మొదలైన గ్లింప్స్ లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. సూపర్బ్ అనిపించే షాట్స్ ఉన్నాయి. కళ్యాణ్‌ రామ్ లుక్, స్టైల్, స్వాగ్, మేకోవర్.. ఇప్పటి వరకూ చూడలేదు అనేలా ఉన్నాయి. ఆ పాత్రలో అతను పూర్తిగా లీనమై నటించాడు అనేలా డెవిల్ యాటిట్యూడ్ కనిపిస్తున్నాయి. ‘డెవిల్ .. ద బ్రిటీష్‌ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ తో ఈ చిత్రం రాబోతోంది.


మీరు చెప్పేదానికి చేసేదానికి, ఆలోచించేదానికి అసలు సంబంధం ఉండదేం సార్ అని సత్య పాత్ర అడిగితే.. ” మనసులో ఉన్న భావన.. ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచనల మాటల్లో బయటపడకూడదు.. అదే గూఢచారికి ఉండవలిసిన ముఖ్యమైన లక్షణం.. ” అంటూ కళ్యాణ్‌ రామ్ చెప్పిన డైలాగ్ సూపర్బ్ అనేలా ఉంది. కళ్యాణ్‌ రామ్ సరసన బింబిసార తర్వాత గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త హీరోయిన్ గా నటిస్తోందీ చిత్రంలో. తన విజువల్ కూడా ఉంది.


అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తంగా ఈ గ్లింప్స్ తోనే కళ్యాణ్‌ రామ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనేలా కనిపిస్తోంది.

Related Posts