ప్రపంచంలోని అన్ని తాజా వార్తలతో వికీ ఇస్తున్న ట్రిబ్యూన్‌… అంతా ఉచితమే!!

ఏదైనా అంశంపై మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే వికీపీడియాని వాడటం తెలిసిందే! ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ సైట్ నుంచి మరో వెబ్‌సైట్‌ రాబోతోంది.. అదే ‘వికీట్రిబ్యూన్‌’.  త్వరలో ఈ నూతన సైట్ ను  అందుబాటులోకి తెస్తున్నట్లు వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్‌ వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు వార్తలు అందించేందుకు ఈ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వికీపీడియా మాదిరిగానే వికీట్రిబ్యూన్‌ కూడా ఉచితంగానే అందుబాటులోకి వస్తుండటం విశేషం.  

నిన్న అన్నయ్య, నేడు తమ్ముడు, కళాతపస్వి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న విశ్వనాథ్ ఇంటికి జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కాళ్లకు నమస్కరించిన పవన్ కల్యాణ్…పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, శ్శాలువతో ఆయనను సత్కరించాడు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నాడు. తన సోదరుడు చిరంజీవికి ఆయన ఇచ్చిన సినిమాలు ఇచ్చిన గుర్తింపుకు గుర్తుగా […]

విశ్వనాధ్ గారి గురించి మాట్లాడే ధైర్యం మాకు ఎక్కడిది:పవన్

కళాతపశ్వి కె.విశ్వనాథ్ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కడంతో యావత్ తెలుగు పరిశ్రమ పులకించిపోతోంది. సినీ పెద్దలంతా విశ్వనాధ్ గారిని కలిసి ఆయనకు తమ అభినందనలు తెలుపుతూ తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఈరోజు ఈరోజు విశ్వనాథ్ గారిని కలుసుకుని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ విశ్వనాథ్ గారిలాంటి గొప్పవారి గురించి మాట్లాడే అర్హత, స్థాయి, అనుభవం, వయసు […]

ఫ్లిప్ కార్ట్ ఒక్కరోజు సీఈవో పద్మిని పగడాల

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ  ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆశ్చర్యపోకండి.. బిగ్ 10 సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ ప్రకటించిన ఒక్క రోజు సీఈవోగా పద్మిని పగడాల నియామకం కావడంతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. అంతేగానీ, పూర్తిస్థాయిలో కాదు! ఫ్లిప్ కార్ట్ తన ఉద్యోగుల కోసం ఈ లక్కీ ఛాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే! 10ఏళ్ల సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి […]

‘డిజిటల్ ఇండియా’కు సారథ్యం వహించనుంది మన చంద్రబాబా?

‘డిజిటల్ ఇండియా’కు సారథ్యం వహించమని ప్రధాని నరేంద్రమోదీ తనను కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వెలగపూడిలో హెచ్ ఓడీలతో ఆయన సమావేశమయిన  సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సమావేశంలో ‘న్యూ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రకటించారని, సన్ రైజ్ ఏపీ, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ఇందులో భాగంగా చేస్తున్నామని చెప్పారు. పశు సంవర్థక శాఖ ద్వారా ఆశించిన వృద్ధి సాధించే అవకాశం ఉందని, ఉద్యావన శాఖలో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించ లేకపోతున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా […]

‘రాందేవ్‌ బాబాకు యాక్సిడెంట్’ అంటూ సోషల్ మీడియాలో వదంతులు!

యోగాగురు రాందేవ్‌ బాబాపై సామాజిక మాధ్యమాల్లో ప‌లు వ‌దంతులు షికార్లు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదానికి గురై, తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని ఫేస్‌బుక్, వాట్స‌ప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పలు వార్త‌లు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన ఆయనను స్ట్రెచర్‌ మీద ఆసుప‌త్రికి తరలిస్తున్నట్టు ప‌లు ఫొటోలు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ క‌థ‌నాల‌పై స్పందించిన ఆయ‌న స‌న్నిహితులు ఇవ‌న్నీ వ‌దంతులేన‌ని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్‌ బాబా హరిద్వార్‌లో […]

వర్మని బతిమిలాడుకుంటున్న జక్కన్న …

`బాహుబ‌లి 2` సినిమా దేశవ్యాప్తం గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాజ‌మౌళి అండ్ టీం ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. సాధార‌ణంగా కొత్త సినిమాల‌ను, పెద్ద పెద్ద డైరెక్ట‌ర్స్‌, స్టార్ హీరోల‌ను వివాదంలోకి లాగే రాంగోపాల్ వ‌ర్మ‌, బాలీవుడ్ క‌మాల్ ఆర్‌.ఖాన్‌లు రాజ‌మౌళిని సెంట‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.అలాగైన సరే రాజమౌళి ని బాహుబలి 2 విడుదల కు ముందు వివాదంలోకి లాగాలని వర్మ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది.అందుకే వ‌ర్మ, రాజ‌మౌళితో ఉన్న ఫోటోను […]

షాకింగ్! ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగులను వదిలేసి పారిపోయిన సిబ్బంది

సికింద్రాబాద్‌లోని శ్రీకర ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊపిరి ఆడక నానా అవస్థలు పడ్డారు. ఐతే, రోగుల ప్రాణాలను గాలికొదిలేసి సిబ్బంది తమదారి తాము చూసుకొని ఏమీ ఆలోచించకుండా పారిపోవడంపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఫ్లిప్‌కార్ట్‌ లో భలే మంచి చౌక భేరమో!!

దేశీయ ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌  ఐఫోన్లపై మంచి ఆఫర్ ను ప్రకటించింది. యాపిల్‌ డేస్‌ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌ 24 నుంచి 26వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక వివరాల్లోకెళితే, యాపిల్‌ ఐఫోన్‌6 ధరపై దాదాపు రూ.26,000 తగ్గిస్తున్నట్లు, ఐఫోన్‌7పై దాదాపు రూ.20,000 తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌పై రూ.6000, 5ఎస్‌ మోడల్‌పై రూ.2501 తగ్గించింది. కేవలం ఫోన్లపై మాత్రమే […]

ఘోరం : మావోయిస్టుల కాల్పుల్లో 26మంది జవాన్ల మృతి 

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా బుర్కాపాల్-చింతగుఫ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సుమారు 26 మంది జవాన్లు చనిపోగా పలువురు గాయపడ్డారు. బుర్కాపాల్‌-చింతాగుఫా మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు బస్తర్‌ డీఐజీ సుందర్‌రాజు ధ్రువీకరించారు. గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు కాల్పులుకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. దీనికి దీటుగా స్పందించిన భద్రతాసిబ్బంది మావోయిస్టులపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. మరోవైపు జవాన్ల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.