అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందనే న్యూస్ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ లో బన్నీ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమాని అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తాడని.. త్వరలోనే ఈ చిత్రం ముహూర్తాన్ని జరుపుకోనుందని వినిపించింది. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఆగిపోయిందట.

‘జవాన్‘తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అట్లీ. ఇక.. అల్లు అర్జున్ తో అనుకున్న సినిమాని కూడా ఇద్దరు స్టార్స్ తో చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. సౌత్ నుంచి అల్లు అర్జున్ ని తీసుకుని.. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ ను తీసుకోవాలనుకుంటున్నాడట. అలా.. తనతో పాటు మరో స్టార్ కూడా నటిస్తున్నాడనే విషయం నచ్చక.. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Related Posts