వెంకీతో ‘సంక్రాంతికి వస్తున్నాం..‘ అంటోన్న అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా కన్ఫమ్ అయినట్టే. అయితే.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ ప్రొడ్యసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో సిసలైన పండగ చిత్రంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దుతున్నాడట అనిల్ రావిపూడి. ఈకోవలోనే.. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రాబోతున్న ఈ మూవీకి ‘సంక్రాంతికి వస్తున్నాం‘ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట.

వెంకటేష్ ఒక్కడు మాత్రమే కాదు.. ఈ సినిమాని ఓ మల్టీస్టారర్ గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి. అయితే.. ఈ మూవీలో వెంకీది మాత్రమే ఫుల్ లెన్త్ రోల్. మిగతావన్నీ ఎక్స్ టెండెడ్ కేమియోస్ లా ఉంటాయట. గతంలో తన చిత్రాల్లో నటించిన హీరోలందరినీ.. బాలకృష్ణ, రవితేజాతో సహా.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట అనిల్. మొత్తంమీద.. వెంకటేష్ తో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి

Related Posts