‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్ మొదలవుతోంది.!

గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. అసలు ఈపాటికే పూర్తవ్వాల్సిన ఈ సినిమా.. దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీ అవ్వడంతో వాయిదా పడుతూ వస్తోంది. ‘ఇండియన్ 2’ అయిపోయింది.. ‘ఇండియన్ 3’కి సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తైంది. అయినా.. ‘గేమ్ ఛేంజర్’ పూర్తవ్వడం లేదు. నత్తనడకన సాగుతోన్న ఈ క్రేజీ మూవీ ఈ వారంలో మరొక కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోనుందట.

జూన్ 7న నుంచి ఆంధ్రప్రదేశ్ లో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కి రెడీ అవుతున్నాడట శంకర్. ఒక వారం రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ ఇదే ఏడాది విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ.. రిలీజ్ డేట్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘జరగండి జరగండి’ పాట విడుదలైంది. త్వరలోనే.. మరో సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత దిల్‌ రాజు.

Related Posts