ముంబైలో సందడి చేస్తున్న ‘‘భారతీయుడు 2‘ టీమ్

కమల్ హాసన్, శంకర్ ‘భారతీయుడు 2‘ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది టీమ్. ఈరోజు ముంబై వేదికగా ‘భారతీయుడు 2‘ ట్రైలర్ లాంఛ్ జరగబోతుంది. అందుకోసం.. హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ లతో పాటు.. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ కూడా ముంబై వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

మరోవైపు ఈరోజు రాత్రి 7 గంటలకు మోస్ట్ అవైటింగ్ ‘భారతీయుడు 2‘ ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ రిలీజ్ టైమ్ అనౌన్స్ చేస్తూ చిత్రబృందం సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఓల్డ్ లుక్ లో ఉన్న కమల్ హాసన్.. కళ్లజోడు, క్యాప్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జూలై 12న ‘భారతీయుడు 2‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts