కొత్త సినిమా ప్రారంభించిన బెల్లంకొండ

ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు పక్కనపెట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈకోవలోనే ‘టైసన్ నాయుడు’ సినిమా చేస్తున్నాడు. ‘భీమ్లా నాయక్‘ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ‘టైసన్ నాయుడు’ ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

మరోవైపు ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఆమధ్య సినిమాని అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇది బెల్లంకొండ కెరీర్ లో 11వ చిత్రం. ఈ మూవీలో బెల్లంకొండకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. గతంలో వీరిద్దరూ నటించిన ‘రాక్షసుడు‘ మంచి విజయాన్ని సాధించింది. అజనీష్ లోక్ నాథ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా.. బెల్లంకొండ 11వ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.

Related Posts