తెలుగులో సూర్య అరుదైన రికార్డ్

మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో ఖచ్చితంగా ఉండే హీరో సూర్య. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు సూర్య. మాస్ లోనూ క్లాస్ లోనూ సమాన ఇమేజ్ ఉన్న రేర్ హీరో అతను. మాస్ ఆడియన్స్ లో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మహిళల్లోనూ అంతే ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అతను. అందుకే తెలుగులో కూడా సూర్యకు మంచి అభిమానులున్నారు.

డబ్బింగ్ సినిమాలతో అడాప్టెడ్ సన్ ఆఫ్ టాలీవుడ్ అని ఎప్పుడో అనిపించుకున్నాడు. అఫ్‌ కోర్స్ సూర్య తమ్ముడు కార్తీని కూడా అలాగే చూస్తారు మనవాళ్లు. అలాంటి సూర్య ఇక్కడ ఓ రేర్ రికార్డ్ అందుకున్నాడు. ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కదా.. ఆ ట్రెండ్ లో అతను డ్యూయొల్ రోల్ లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అసలే మాత్రం ప్రమోషన్స్, హడావిడీ లేకుండా విడుదలైంది. దీంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోరేమో అనుకున్నారు చాలామంది.

కానీ ఈ శుక్రవారం సరైన సినిమా లేకపోవడంతో సూర్య సన్ ఆఫ్‌ కృష్ణన్ ను తెలుగువాళ్లు ఓ రేంజ్ లో చూశారు. అందుకే ఈ చిత్రానికి మొదటి రోజు ఏపి, తెలంగాణలో కలిపి ఏకంగా 1 కోటి 72 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఈ డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి.

మన హీరోల్లో కొందరి సినిమాలకు ఇందులో సగం కూడా రాలేదు. ఓ డబ్బింగ్ సినిమాకు ఇంత క్రేజ్ ఏంటా అనే ఆశ్చర్యమే తప్ప.. మనవాళ్లను తక్కువ చేయడం ఉద్దేశ్యం కాదు. ఈ మూవీకే ఇలా ఉంటే రాబోయే ప్యాన్ ఇండియన్ మూవీ కంగువా రేంజ్ ఇంకెలా ఉంటుందో మరి.

Related Posts