దర్శకుడుగా స్టార్ హీరో కొడుకు

స్మాల్ హీరోల కొడుకులే హీరోలుగా పరిచయం అవుతున్న కాలం ఇది. అలాంటిది ఓ టాప్ స్టార్ కొడుకు దర్శకుడుగా మారుతున్నాడు అంటే కాస్త ఆశ్చర్యం అనే చెప్పాలి. యస్.. తమిళ్ టాప్ స్టార్స్ లో ఒకడైన ఇళయదళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడుగా ఇంటర్ డ్యూస్ కాబోతున్నాడు.

కొన్నాళ్ల క్రితం విదేశాల్లో సినిమా మేకింగ్ కు సంబంధించిన కోర్స్ చదువుకుని వచ్చాడు జేసన్. రాగానే నటనలోకి ఎంటర్ అవుతాడు అనుకున్నారు విజయ్ ఫ్యాన్స్. బట్ అతను డిఫరెంట్ పాథ్ ను ఎంచుకున్నాడు.

దర్శకుడుగా మారి యాక్షన్ కట్ చెప్పాలనుకున్నాడు. కొడుకు ఉత్సాహాన్ని, ఇంట్రెస్ట్ ను తండ్రి ఎంకరేజ్ చేశాడు. కట్ చేస్తే ఫస్ట్ మూవీనే లైకా ప్రొడక్షన్స్ లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో చేయబోతున్నాడు. ఈ మేరకు లైకా నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

మామూలుగా ఇలాంటివి పెద్దగా ఎలివేట్ కావు. కానీ స్టార్ హీరో కొడుకు కదా.. అందుకే జేసన్ సంజయ్ దర్శకుడుగా మారుతున్న విషయం కూడా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి జేసన్ తమిళ్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తాడా లేక.. యూనిక్ కంటెంట్స్ తో కంట్రీ మొత్తం ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.

Related Posts