నితిన్ ‘రాబిన్ హుడ్‘లో హీరోయిన్ గా శ్రీలీల

నితిన్- వెంకీ కుడుమల కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్‘ సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఫిక్సయ్యింది. ఈరోజు శ్రీలీల బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. వెయిట్ తెలీదు.. హెడ్ వెయిట్ మాత్రం ఇన్ఫినిటీ అంటూ ఈ సినిమాలో శ్రీలీల పోషిస్తున్న ది లేడీ బాస్ క్యారెక్టర్ గురించి చెప్పకనే చెప్పింది చిత్రబృందం.

‘భీష్మ‘ వంటి బడా హిట్ తర్వాత నితిన్-వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి జీ.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరోవైపు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్‘లోనూ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. అలాగే.. అజిత్ తో మైత్రీ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘లోనూ శ్రీలీల పేరే కథానాయికగా వినిపిస్తుంది. మొత్తంమీద.. మైత్రీ సంస్థలో మూడు సినిమాలతో దూకుడు పెంచుతోంది శ్రీలీల.

Related Posts