‘స్వాగ్‘ కోసం సరికొత్తగా శ్రీవిష్ణు

విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు శ్రీవిష్ణు. గత ఏడాది ‘సామజవరగమణ’ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ‘ఓం భీమ్‌ బుష్‌’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘స్వాగ్’ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు.

గతంలో శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’ సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ‘స్వాగ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కంటెంట్ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్సెస్ తో తెలిపాడు డైరెక్టర్. ఇక.. ఈ చిత్రంలో శ్రీవిష్ణు ఏకంగా 14 గెటప్పులో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా ఆ విజువల్స్ తోనే ‘రేజర్‘ పేరుతో ‘స్వాగ్‘ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. వంశాలైన, ఆస్తులైన, ఆడవాళ్ళైనా, మగవాడినే అనుసరించాలి‘ అనే ఆలోచనలతో సాగే భవభూతి అనే పాత్రలో శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. ఈ స్పెషల్ గ్లింప్స్ తో విభిన్న గెటప్స్ తో శ్రీవిష్ణు ఆకట్టుకుంటున్నాడు.

https://www.youtube.com/watch?v=QuLXIVIu6M0

Related Posts