సమ్మర్ సందడి ముగిసిపోయింది. ఇక చిన్న హీరోల సందడి మొదలవుతోంది. వరుసగా మీడియం రేంజ్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. అప్పుడప్పుడూ వీరి మధ్య ఓ క్లాష్ రావడం కామన్. అసలు క్లాష్ ఉంటేనే కదా.. కమాండ్ ఎవరిదో తెలిసేది. ఈ నెల 28న నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీ విడుదలవుతోంది.
మళయాల బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బిహెచ్ దర్శకుడు. రీసెంట్ గా విడుదలైన టీజర్, లేటెస్ట్ గా వచ్చిన పాట ఆకట్టుకున్నాయి. అయితే నిఖిల్ కు ఇది సోలో రిలీజ్ అనుకుంటే అతనికి పోటీగా మరో మీడియం స్టార్ శ్రీ విష్ణు ఆ నెక్ట్స్ డే నేనూ వస్తున్నా అంటున్నాడు.
శ్రీ విష్ణు హీరోగా నటించిన కొత్త సినిమా సామజవరగమనా ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ గా అర్థం అవుతోంది. తను డిగ్రీలో ఉండగా లవ్ చేసిన అమ్మాయి రాఖీ కట్టిందని.. తర్వాత తనను ఎవరు ప్రేమించినా వారితో బలవంతంగా రాఖీ కట్టించుకునే కుర్రాడిగా శ్రీ విష్ణు నటించాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు కూడా ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ మూవీ టీజర్ తర్వాత అతను ఎదురుచూస్తోన్న విజయం వచ్చేలానే ఉంది. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా ఈ మీడియం హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.