ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాలి ”భీమా” ..

కొన్నాళ్లుగా ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా.. అవన్నీ కేవలం తన ఇమేజ్ ను బేస్ చేసుకుని వస్తోన్న కథలే కావడంతో కాస్త రొటీన్ గానూ ఉంటున్నాయి. చివరగా వచ్చిన రామబాణంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు గోపీచంద్. బట్ ఈ మూవీ మరీ దారుణంగా పోయింది. బట్ ఒక్క హిట్ పడితే గోపీచంద్ రేంజ్ ఏంటో తెలుస్తుంది.

మాస్ ఆడియన్స్ కు మోస్ట్ ఫేవరెట్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న గోపీచంద్ ఇప్పుడు కన్నడ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. కన్నడలో మాస్ మూవీస్ తో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న ఏ హర్ష డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సోమవారం గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేశారు.


”భీమా” అనే టైటిల్ పెట్టారీ చిత్రానికి. ఇంతకు ముందు గోపీచంద్ తో గౌతమ్ నందా చిత్రాన్ని రూపొందించిన కేకే రాధామోహన్ నిర్మాత. నిజానికి ఈ మూవీని కెజీఎఫ్ స్టార్ యశ్ తో చేయాలనుకున్నాడు హర్ష. యశ్ చాలాకాలం వెయిట్ చేయించి నో చెప్పాడు. దీంతో అదే కథతో గోపీచంద్ ను ఒప్పించాడు.

ఇక ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. పోస్టర్ అయితే చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా రౌద్రపూరిత లుక్ తో ఉన్న గోపీచంద్ వెనక మధించిన ఆంబోతు ఉండటం పోస్టర్ రేంజ్ మరింత పెంచింది. మొత్తంగా ఈ పోస్టర్ చూస్తోంటే గోపీచంద్ కు ఖచ్చితంగా ఓ భారీ హిట్ పడేలా ఉంది. మరి ఈ భీమాతో గోపీచంద్ కు భారీ హిట్ రావాలని కోరుకుంటూ ఈ మేచో స్టార్ కు తెలుగు 70ఎమ్ఎమ్ నుంచి మనస్ఫూర్తిగా బర్త్ డే విషెస్ చెబుదాం..