ఈ వారం బాక్సాఫీస్ వద్ద రోహిత్ వర్సెస్ విశాల్

వేసవి అంటేనే సినిమాలకు మంచి సీజన్. అయినా.. ఈ ఏడాది వేసవి డల్ గా సాగుతోంది. ఒక్క ‘టిల్లు స్క్వేర్’ తప్పితే మిగతా చిత్రాలేవి ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఇప్పుడు ఈ మండు వేసవిలో మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఈ వారం వస్తున్నాయి నారా రోహిత్ ‘ప్రతినిధి 2’, విశాల్ ‘రత్నం’ చిత్రాలు. ఒక్క రోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి.

దాదాపు ఆరు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ‘ప్రతినిధి 2’. పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది. కాంటెంపరరీ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘ప్రతినిధి 2’పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఏప్రిల్ 25న ‘ప్రతినిధి 2’ థియేటర్లలోకి దిగుతోంది.

యాక్షన్ స్టార్ అనే ఇమేజ్ కు సార్దకనామధేయుడు విశాల్. అలాగే.. పర్ఫెక్ట్ యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న హరి.. ఈసారి విశాల్ కి తోడయ్యాడు. వీరిద్దరి కాంబోలో రూపొందిన చిత్రమే ‘రత్నం’. గతంలో విశాల్ కి డైరెక్టర్ హరి ‘భరణి, పూజ’ రూపంలో రెండు సూపర్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ అందించాడు. ఈసారి ‘రత్నం’తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 26న తెలుగు, తమిళం భాషల్లో ‘రత్నం’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts