మార్చి 28న పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’

మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ది గోట్ లైఫ్’. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ‘ది గోట్ లైఫ్’.. ‘ఆడు జీవితం’ పేరుతో ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ సినిమా రెండు వారాల పాటు ప్రీపోన్ అయ్యింది. మార్చి 28న ఈ సినిమా పాన్ ఇండియన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథతో.. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా కావడం విశేషం

Related Posts