ఉత్తర అమెరికాలో కలెక్షన్ల కింగ్ ప్రభాస్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం కావడంతో అమెరికాలో మన సినిమాలకు డాలర్ల వర్షం కురుస్తుంటుంది. ఇక.. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సౌతిండియన్ మూవీస్ లో.. నాలుగు చిత్రాలు ప్రభాస్ వే కావడం విశేషం.

నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా ‘బాహుబలి 2‘ నిలిచింది. అమెరికాలో ఈ సినిమా ఏకంగా 21 మిలియన్ డాలర్స్ కు పైగానే కొల్లగొట్టింది. ఆ తర్వాతి స్థానంలో రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్‘ ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమా అక్కడ 14.83 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ‘కల్కి, సలార్, బాహుబలి‘ సినిమాలున్నాయి. వీటిలో ‘కల్కి‘ సినిమా ఇప్పటికే 9 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్‘ వసూళ్లను అధిగమించి రెండో స్థానానికి వెళ్లే అవకాశాలున్నాయి.

మరోవైపు.. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.415 కోట్లు కొల్లగొట్టింది ‘కల్కి‘. ఈరోజు ఆదివారం కూడా వసూళ్లకు ఢోకా లేదు. మొత్తంగా.. ఈ వీకెండ్ కు ‘కల్కి‘ రూ.500 కోట్లు దాటేయడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts