మా అధ్యక్షుడు విష్ణు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు తన మాకు ఎన్నికై ఏడాది పూర్తి అయ్యింది. ఎన్నికల సమయంలో తాను వాగ్దానం చేసిన అంశంలో 90 వాగ్ధానాలను పూర్తి అయ్యాయి. ఏడాది కాలం మరియు వాగ్దానాలు నెరవేర్చిన పూర్తి అయిన సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు, మాదాల రవి, శివ బాలాజీ మరియు ఇతర ప్యానెల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ “అక్టోబర్ 13, 2021 న నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను. నాకు సపోర్ట్ చేసిన అందరికి, మీడియా కి నా ధన్యవాదాలు. మా ఎలక్షన్స్ హోరా హోరీగా ఒక స్టేట్ ఎలక్షన్స్ గా జరిగాయి. ప్రతి తెలుగు ప్రేక్షకుడు తన సొంత ఎలక్షన్ గా కృషి చేశారు. మా మేనిఫెస్టో లో చేసిన వాగ్దానాలు 90 శాతం నెరవేర్చాం.

1. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి అనే అంశాన్ని సమకూర్చాము. నటి నటుల జాబితా తో ఒక పుస్తకం చేసాము. ఆ పుస్తకాన్ని ప్రతి నిర్మాతకి దర్శకుడికి పంపించాము. సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం, సంక్రాంతి కి సిద్ధం అవుతుంది. ఈ యాప్ కాన్సెప్ట్ భారత దేశంలో ప్రప్రధమం.

2. మహిళల సంరక్షణ : మా అసోసియేషన్ మహిళల రక్షణ కోరుకుంటుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ గారిని అడ్వైసర్ గా తీసుకుంటూ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసాము. మహిళలకి ఏ విధమైన సమస్య వచ్చిన ఈ కమిటీ పరిష్కరిస్తుంది.

3. మెంబెర్ షిప్ : గతంలో 9 వందల చిల్లర సభ్యులు ఉన్నారు, కానీ 20 నుంచి 25 శాతం మంది నటులే కాదు. అయితే ఇప్పుడు మెంబెర్ షిప్ చాలా కఠినతరం చేసాం. కేవలం నటులకు మాత్రమే మెంబర్ షిప్. లైఫ్ మెంబెర్ అవ్వాలి అంటే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ కనీసం రెండు చిత్రాల్లో నటించాలి మరియు రెండు చిత్రాలు థియేటర్ లో కానీ ఓ టి టి లో విడుదల అయి ఉండాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కనీసం 10 సినిమాలు చేసి ఉండాలి, రెండు నిమిషాలు డైలాగ్ పోర్షన్ ఉండాలి. మరియు ఐదు నిమిషాల నిడివి ఉండాలి. లైఫ్ మెంబెర్ కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మిగతా నటి నటులు అసోసియేట్ నెంబర్ అవొచ్చు. మేము దర్శక నిర్మాతలకు సూచించారు. వాళ్ళ సినిమాలో నటించే ప్రతి నటి నటులు మా మెంబెర్ కావాలి అని సూచించాము.

4. పెన్షన్ : మేము 6 మెంబెర్స్ కి పెన్షన్ రద్దు చేస్తాం. ఎందుకంటే ఆ ఆరుగురు నటి నటులు కాదు. అర్హులైన వాళ్ళకి 6వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము.

5. క్రమశిక్షణ : మా సభ్యులు ఎవరైనా సోషల్ మీడియా లో కానీ మీడియా లో కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన, ధర్నాలు చేసిన వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తాం. నటి నటులకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పరిష్కరిస్తాం కానీ మీడియా కి వెళ్లిన సోషల్ మీడియా లో మాట్లాడిన సభ్యత్వం రద్దు చేస్తాం.

6. ఎలక్షన్స్ : కనీసం ఐదు సంవత్సరాలు లైఫ్ మెంబర్ గా ఉంటే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయవచ్చు.

7. మా బిల్డింగ్ : ఫిలిం నగర్ క్లబ్ నుంచి 30 నిమిషాల దూరంలో ఒక బిల్డింగ్ చూసాం. అది 6 నెలలో సిద్ధం అవుతుంది. లేకపోతే ఫిలిం నగర్ ఛాంబర్ కొత్త బిల్డింగ్ కడుతున్నారు, అయితే ఆ బిల్డింగ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి స్థలం ఉంటుంది. అప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అన్ని విధాలా గా సాయం చేస్తాను.

మా సభ్యులందరికి మెడికల్ సపోర్ట్ ఇచ్చాము. దానికి మాదాల రవి గారు చాలా సహాయం చేశారు. ప్రతి నాలుగు నెలకొకసారి మెడికల్ హెల్త్ చెక్ అప్ చేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్ రేసింగ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఆ ఈవెంట్ వేరే దేశం లో జరుగుతుంది. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం. మా సభ్యులకి ఎడ్యుకేషన్ ఫి లో కూడా రాయితీ ఇస్తుంది. మోహన్ బాబు యూనివర్సిటీ లో సినిమా ఇండస్ట్రీ లో పని చేసే ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తున్నాం. మంచు మోహన్ బాబు మాట్లాడుతూ “మా సభ్యులు చాలా బాగా పని చేస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ లో సినిమా ఇండస్ట్రీ లో పని చేసే ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తున్నాం. చాలా మంది చదువుతున్నారు, ఇంకా ఎవరైనా చదవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కాలర్షిప్ ఇష్టము” అని తెలిపారు.

Related Posts