ఎక్స్ ట్రార్డినరీ ఎంటర్ టైన్ మెంట్ తో నితిన్ చిత్రం

యూత్ స్టార్ నితిన్ ఈసారి ఎక్స్ ట్రా ఫన్, ఎక్స్ ట్రా యాక్షన్, ఎక్స్ ట్రా ఎంటర్ టైన్ మెంట్ తో అందరినీ ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ రూపొందించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజయ్యింది. ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ మొదలవ్వగానే.. ‘నాకు నేనంటే బోర్ అమ్మ.. ఎప్పుడూ ఇంకొకడిలా ఉండాలనిపిస్తుంది.. రోజుకొకలా.. అంటూ చిన్నప్పుడు నితిన్ వాళ్లమ్మతో అంటే.. నీలో యాక్టర్ ఉన్నాడనుకుంటున్నాను రా..’ అంటోంది. ఇక.. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు నితిన్. శ్రీలీలతో లవ్, రొమాన్స్.. తండ్రి రావు రమేష్ తో ఫన్ ఈ ట్రైలర్ లో హైలైట్స్ అని చెప్పాలి. ఇక.. మాస్ కోరుకునే యాక్షన్ అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాకి మరో ఆకర్షణ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్. ఇప్పటివరకూ అగ్రెస్సివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన రాజశేఖర్.. ఈ సినిమాలో అందుకు పూర్తిభిన్నంగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘జీవితం చెప్పేది తప్ప.. జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను..’ అంటూ నవ్వుతూ సాఫ్ట్ క్యారెక్టర్ లో రాజశేఖర్ దర్శనమిస్తున్నాడు. హ్యారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ నుంచి వస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 8న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts