‘రాజా సాబ్‘ కోసం రంగంలోకి దిగిన మారుతి

రెబెల్ స్టార్ ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతోంది. డార్లింగ్ తో సినిమా చేస్తే చాలు.. పాన్ ఇండియా హిట్ కొట్టేయొచ్చు అనేది ఇప్పుడు డైరెక్టర్ల ఆలోచన. ‘సలార్, కల్కి‘ చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ‘రాజా సాబ్‘. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకూ ప్రభాస్ పోషించనటువంటి హారర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘రాజా సాబ్‘ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్ టార్గెట్ గా ‘రాజా సాబ్‘ సిద్ధమవుతోంది.

‘రాజా సాబ్‘లో మొత్తంగా ఐదు పాటలుంటాయి. ఇప్పటికే మూడు పాటలను రెడీ చేశాడట మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మిగిలిన రెండు పాటల కోసం ప్రస్తుతం డైరెక్టర్ మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. చెన్నై మెరీనా బీచ్ లో మకాం వేసినట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ‘కల్కి‘ విజయంతో క్లౌడ్ నైన్ లో విహరిస్తున్న ప్రభాస్.. నాలుగు వారాల పాటు ఫారెన్ వెళ్లి.. వచ్చిన తర్వాతే ‘రాజా సాబ్‘ షూట్ లో పాల్గొంటాడట.

Related Posts